కేంద్రానికి రైతుల ‘ పార్ములా66’ హెచ్చరిక..?

-

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని రైతులు చేస్తున్న ఉద్యమం నేటితో 33వ రోజుకు చేరింది. ఈ విషయమై రైతు నాయకులతో కేంద్రం దాదాపుగా ఐదుసార్లు జరిపిన చర్చలన్నీ విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేయాలని ఆదేశించిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్రంతో మరోసారి చర్చల నేపథ్యంలో రైతు సంఘాలు పలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మారు కేంద్రం నుంచి అనుకూల స్పందన రాకపోతే ‘ఫార్ములా 66’ అని హెచ్చరించారు.

గత 33 రోజులుగా రోడ్లపై చలికి వణుకుతూ ధర్నాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని రైతు సంఘం నాయకుడు రాకేష్‌ టికైత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మా డిమాండ్లు అంగీకరించకపోతే మేం ‘ఫార్ములా 66′ ని అమలు చేస్తాం. అంటే ఇప్పటికి రెట్టింపు రోజులు మా ఆందోళనని కొనసాగిస్తాం’ అని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, ప్రబుఖులు, విదేశాల నుంచి సైతం తమకు మద్ధతు తెలుపుతున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news