అదానీ సంచలన నిర్ణయం.. ఛారిటీ కోసం 60 వేల కోట్లు

-

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సామాజిక సేవకు ముందుకు వచ్చారు. తన 65 వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆదాని… ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజ సేవ కోసం 60 వేల కోట్ల భారీ విరాళం ప్రకటించారు. విద్య వైద్యం నైపుణ్య అభివృద్ధి కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు.

ఆదాని ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు అదాని. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ జయంతి కూడా ఈ ఏడాదే రావడంతో దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆయన గ్రూపు సభ్యుల నిర్ణయం తీసుకున్నారు.

60 వేల కోట్ల విరాళా మొత్తాన్ని ఆదాని ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం వినియోగించనున్నారు. కాగా ఇప్పటివరకు దాతృత్వం లో కార్పొరేట్లు రతన్ టాటా మరియు అజీమ్ ప్రేమ్జీ ముందు ఉండేవారు. తాజాగా వారి సరసన గౌతమ్ అదానీ చేరనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news