మెగా స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..MEGA154 రిలీజ్ డేట్ ఫిక్స్

-

ఆచార్య సినిమా తర్వాత మెగా స్టార్‌ చిరంజీవి.. తన ఫ్యాన్స్‌ కోసం వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి… మూడు సినిమాలను లైన్‌ లో పెట్టారు. అందులో ఒకటే మెగాస్టార్ 154 సినిమా. ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ బాబి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా మైత్రి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అలాగే ఈ సినిమాకు టాలీవుడ్ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఈ సినిమా నుంచి… ఓ అదిరిపోయే అప్డేట్ ను వదిలింది చిత్ర బృందం.

ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్‌ చేసింది చిత్ర బృందం. వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 154 సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా వదిలింది చిత్ర బృందం. ఈ అప్డేట్‌ తో మెగా స్టార్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news