భారతీయులు ఎక్కువగా పెట్టుబడి పెట్టే వాటిలో పసిడి ముఖ్యమైనది. ఆడవాళ్లు, మగవారు తేడా లేకుండా దీన్ని సేవింగ్స్ కింద కూడా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా ఆడవారికి బంగారం అంటే ఎనలేని మక్కువ. కానీ కొన్నాళ్ల నుంచి మహిళలను బంగారం ధరలు భయపెడుతున్నాయి. రోజురోజుకు ధరల పెరుగుదల ఆడవారిని ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర రూ.2,185 పెరిగి.. ప్రస్తుతం రూ.62,900 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,167 పెరిగి.. ప్రస్తుతం రూ.77,560 వద్ద కొనసాగుతోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి.
- హైదరాబాద్లో పది గ్రాముల బంగారం ధర రూ.62,900 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.77,560 రూపాయలుగా ఉంది.
- విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.62,900గా ఉంది. కిలో వెండి ధర రూ.77,560 వద్ద కొనసాగుతోంది.
- వైజాగ్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.62,900 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.77,560గా ఉంది.
- ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.62,900గా ఉంది. కేజీ వెండి ధర రూ.77,560 వద్ద ఉంది.