గుడ్ న్యూస్: భారీగా దిగొచ్చిన బంగారం.. వివరాలు ఇవే..!

-

పసిడి ప్రియులకి శుభవార్త. బంగారం ధర మరోసారి దిగొచ్చింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. బంగారం ధర తగ్గింది. అదే విధంగా వెండి రేటు కూడా తగ్గింది. ఇది నిజంగా బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి రిలీఫ్ గా ఉంటుంది.

ఇక ధరలు ఎలా వున్నాయి అనేది చూస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.660 పడిపోయింది. దీనితో బంగారం రూ.48,270కు తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర అయితే రూ.600 తగ్గుదలతో రూ.44,250కు క్షీణించింది.

అంతర్జాతీయ మార్కెట్‌ లో కూడా బంగారం ధర తగ్గింది. 0.59 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1764 డాలర్లకు క్షీణించింది.

ఇక వెండి రేటు చూస్తే.. వెండి రేటు ఏకంగా రూ.1100 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.74,000కు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌కు 0.11 శాతం క్షీణత తో 25.82 డాలర్లకు తగ్గింది.

ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలైన వాటి ప్రభావం బంగారం మీద పడతాయన్న సంగతి తెలిసిందే.

 

 

Read more RELATED
Recommended to you

Latest news