స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవలు వలన చాలా మందికి ప్రయోజనం ఉంటోంది. స్టేట్ బ్యాంక్  చాలా రోజుల క్రితమే వాట్సప్ సేవల్ని ప్రారంభించింది. ఇక దీని గురించి పూర్తి వివరాలు చూస్తే.. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ సేవల ద్వారా కస్టమర్లకు 15 పైగా సేవలు లభిస్తున్నాయి. ఇక నుండి ఈ సేవలని పొందేందుకు కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కస్టమర్ కేర్‌కు కాల్ చేయక్కర్లేదు కూడా. స్మార్ట్‌ఫోన్ ఓపెన్ చేసి వాట్సప్ బ్యాంకింగ్ ద్వారానే 15 కి పైగా సేవల్ని పొందొచ్చు.

వాట్సప్ బ్యాంకింగ్ సేవల్ని పొందాలంటే… ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుండి రిజిస్టర్ చేయాలి. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్ కోసం రిజిస్టర్ చేయడానికి ఇలా చేయండి. కొత్త మెసేజ్ ఓపెన్ చేసి SMS WAREG అని టైప్ చేసి స్పేస్ ఇవ్వండి. తర్వాత అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి. +917208933148 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి.

ఆ తర్వాత +919022690226 నెంబర్‌‌ను ని స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ చేయాలి. ఎస్‌బీఐ వాట్సప్ బ్యాంకింగ్‌కు రిజిస్టర్ చేసాక వాట్సప్‌ ఓపెన్ చేసి +919022690226 నెంబర్‌కు Hi అని పంపండి. మొదట Get Balance, Get Mini Statement ఆప్షన్స్ మీకు కనపడతాయి. ఆ తర్వాత Other Services పైన క్లిక్ చేస్తే ఇంకొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇలా అనేక సేవలని పొందవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news