పవన్ ‘జై బాబు’..జనం ‘జై జగన్’.!

-

టి‌డి‌పి అధినేత చంద్రబాబు పాలన చాలా బాగుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పడం కాస్త విడ్డూరంగానే కనిపిస్తోంది..కానీ పవన్ కు రాజకీయంగా టి‌డి‌పితో అవసరం కాబట్టి..ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ విధంగా ఇప్పుడు వైసీపీ పాలన కంటే గత టి‌డి‌పి ప్రభుత్వ పాలన బెటర్ గా ఉందని తాజాగా వారాహి మూడో విడత యాత్ర ముగింపు ప్రెస్ మీట్ లో పవన్ సెలవిచ్చారు.

అసలు జగన్ అద్భుతంగా పాలన చేస్తే తానే సంతోషిస్తానని, కానీ అలా చేయడం లేదని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని, వ్యవస్థలని నాశనం చేశారని, దోపిడీలు, అక్రమాలు, ప్రశ్నించిన వారిపై కేసులు, ప్రజలపై పన్నుల భారం, ఆర్ధికంగా ఏపీ వెనుకబడేలా చేశారని, అసలు జగన్ పాలన తో పోలిస్తే గత టి‌డి‌పి పాలన బెటర్ అనిపిస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. అందుకే టి‌డి‌పితో పొత్తులో కలిసి వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా జగన్‌ని ఓడించి అధికారంలోకి రావాలని పవన్ చూస్తున్నారు.

అయితే పవన్ ఓ రకంగా బాబుకు జై కొడుతున్నారు. మరి బాబు పాలన బాగుంటే 2019 ఎన్నికల్లో ప్రజలే బాబుకు జై కొట్టేవారు.ఆ చిన్న లాజిక్ పవన్ ఎలా మిస్ అయ్యారో. అంటే బాబు గ్రాఫిక్స్ పాలన, ఇచ్చిన మాట తప్పడం, టి‌డి‌పి నేతల అక్రమాలు పవన్‌కు నచ్చాయి..కానీ ప్రతి పేద, మధ్య తరగతి ప్రజలకు మాట తప్పకుండా పథకాలు ఇస్తూ, వారిని ఆర్ధికంగా ఆదుకుంటున్న జగన్ పాలన నచ్చలేదు. అయితే పవన్ కు నచ్చకపోయిన పోయిదేమీ లేదు. కానీ ప్రజలకు జగన్ పాలన నచ్చింది.

అందుకే ఇప్పటికీ ప్రజలు జగన్ వెంట ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. మళ్ళీ ఆయనే అధికారంలోకి వస్తారని ప్రజలు భావిస్తున్నారు. ఒకవేళ జగన్ పాలన కాకపోతే ప్రజల మద్ధతు ఉండదు. కానీ ఇప్పటికీ మద్ధతు ఉందంటే దాని అర్ధం.జగన్ పాలన బాగుందనే..అందుకే జనం జగన్‌కు జై కొడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news