ఈపీఎఫ్‌వో గుడ్ న్యూస్.. ఇక నుండి ఎనిమిది లక్షలు..!

-

తాజాగా గుడ్ న్యూస్ ని తీసుకొచ్చింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ EPFO. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే తన ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా అంశానికి సంబంధించి ఓ ముఖ్యమైన డెసిషన్ ని తీసుకున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

 

epf

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఎక్స్‌గ్రేషియాను డబుల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఎక్స్‌గ్రేషియా డెత్ రిలీఫ్ ఫండ్‌ను రూ.4.2 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ప్రకటించడం జరిగింది. అయితే ఒకవేళ కనుక ఉద్యోగులు చనిపోతే ఈ డబ్బులను వారి కుటుంబ సభ్యులకు లేదా నామినీ లేదా చట్టపరమైన వారసులకు ఇవ్వడం జరుగుతుంది.

దానితో వారికి రూ.8 లక్షలు లభిస్తాయి. ఇది ఇలా ఉంటే ఈ డబ్బులను ప్రతి మూడేళ్లకు ఒకసారి 10 శాతం చొప్పున పెంచుతారు. ఈ నిర్ణయం తీసుకోవడం వలన దాదాపు 30 వేల మందికి పైగా బెనిఫిట్ కలగనుంది. అదే విధంగా ఈపీఎఫ్‌వో ఇటీవలనే పీఎఫ్ అకౌంట్లలో వడ్డీ డబ్బులను వేసిన సంగతి అందరికీ తెలిసినదే.

Read more RELATED
Recommended to you

Latest news