చైనా.. యూస్ అధినేతల మధ్య వర్చువల్ సమావేశం.

-

ప్రపంచ సూపర్ పవర్స్.. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన యూఎస్ఏ, చైనా ల అధినేతల మధ్య నేడు వర్చువల్ సమావేశం జరుగనుంది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుల జో బిడెన్ ల మధ్య వర్చువల్గా సమావేశం కావడం ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిపై ఇరు నేతలు చర్చించనున్నారు.

రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్‌ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్‌గుర్‌లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో చైనా సరిహద్దు దేశాలతో సమస్యలు తీసుకువస్తుంది. దీంతో పాటు దక్షిణ చైనా సముద్రంపై గుత్తాధిపత్యం కోసం చైనా తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు వన్ చైనా విధానానికి ప్రపంచ దేశాలు కట్టుబడాలని చైానా హెచ్చిరిస్తోంది. ఇటవల కాలంలో తైవాన్, చైనాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరకుంది. తైవాన్ గగనతలంలోకి చైనా తన ఫైటర్ జెట్లను కూడా పంపింపి ఉద్రిక్తతలను మరింత పెంచింది. మరోవైపు అమెరికా, యూరోపియన్ యూనియన్లు తైవాన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో రెండు అగ్ర దేశాల మధ్య ఈ సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news