నీట్, జేఈఈ వాయిదా వేయాలంటూ కోరిన గ్రేటా థన్‌బెర్గ్..!

-

భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో నీట్, జేఈఈ వంటి ప్రవేశపరీక్షలను వాయిదా వేయాలంటూ ప్రముఖ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థన్‌బెర్గ్ భారత ప్రభుత్వాన్ని కోరింది. ‘భారత్‌లో ఒకవైపు కరోనా మరోవైపు వరదల కారణంగా కోట్లాదిమంది నష్టపోయిన పరిస్థితి ఏర్పడింది. అందుకే నీట్, జేఈఈ వాయిదా వేయాలంటున్న వారికి నేను కూడా మద్దతు పలుకుతున్నాను’ అంటూ గ్రేటా థన్ బెర్గ్ ట్వీట్ చేసింది.

ఈ విషయమై ఇప్పటికే ఎంతో మంది స్పందించారు. కాగా, జేఈఈ మెయిన్ సెప్టెంబ‌ర్ 1 నుంచి 6 వ‌ర‌కు, నీట్ సెప్టెంబ‌ర్ 13న జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా ప్ర‌తిష్టాత్మక విద్యాసంస్థ‌లైన ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ సెప్టెంబర్‌ 27న జ‌ర‌గ‌నుంది. అయితే కరోనా అనుమానితుల‌కు ఐసోలేష‌న్ గ‌దిలో ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న‌ట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేయాలని ఆయనేకమంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news