ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తరచూ తన దృష్టికి వచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు నెటిజన్లతో షేర్ చేసుకుంటారు. తాజాగా ఆయన వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేశారు. ఇంటి నుంచి కంటే ఆఫీస్ నుంచి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లడించారు. పై ఛార్ట్ రూపంలో ఆయన ఇచ్చిన వివరణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
ఆ పోస్ట్‌లో మొదటి పై ఛార్ట్ ‘వర్కింగ్ ఫ్రమ్ హోం’కు సంబంధించింది. అది మొత్తం పనితోనే నిండిపోయింది. అదే ‘వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్’ అని గీసిన ఛార్ట్‌లో చాలా విషయాలకు అవకాశం ఉంటుందని వివరించారు. ‘కాఫీ, లంచ్ బ్రేక్ తీసుకోవచ్చు, ట్రాఫిక్‌లో కొద్దిసేపు వేచి ఉండొచ్చు, ఇంకొద్దిసేపు మన పనిచేసుకొని, మన తోటివారికి సహకరించొచ్చు’ అని ఆ ఛార్ట్‌లో పేర్కొన్నారు.
గోయెంకా ఈ ట్వీట్ చేస్తూ.. ఓ వ్యాఖ్యను జోడించారు. ‘మీరు ఆఫీస్ నుంచే పనిచేయాలనేందుకు కారణమిదే’ అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు తమ అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
Here is a reason why you should work from office 😀😀😀! pic.twitter.com/rMcjD9ahl8
— Harsh Goenka (@hvgoenka) September 29, 2022