BREAKING : ఏపీకి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతము మీద ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నది .ఇది సగటు సముద్ర మట్టానికి 4 . 5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.
ఒక తూర్పు- పడమర ద్రోణి ,ఆంధ్ర ప్రదేశ్ తీరం వద్ద ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి తీర ప్రాంత కర్ణాటక వరకు రాయలసీమ మరియు దక్షిణ అంతర్గత కర్ణాటక మీదగావ్యాపించి ఉన్నది . ఇది సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుండి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం ఫై 3.1 కి.మీ ఎత్తు లో ఉన్నమరొక తూర్పు- పడమర ద్రోణి, పై ( 2 లో పేర్కొనబడిన) ద్రోణి తో కలిసిపోయింది.
దీతేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా మూడు పాటు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని… ఉరుముల తో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ.