50 ఏళ్లుగా టమాట సాగు.. ఇప్పుడు కలిసొచ్చిన లక్

-

గత కొంతకాలంగా టమాట ధరలు సామాన్యుడికి మంట పెడుతున్నాయి. కిలో టమాట ధర ప్రస్తుతం రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలతో సామాన్యులు టమాటలు కొనుగోలు చేయలేక వాటిని వాడటమే ఆపేశారు. అయితే ఈ ధరల పెరుగుదల మాత్రం కొందరు రైతులకు లాభాలు తెచ్చిపెడుతోంది. మొన్నటిదాకా దిక్కుతోచని స్థితిలో ఉన్న టమాట రైతులు.. ప్రస్తుతం లక్షాధికారులు.. కోటీశ్వరులు అవుతున్నారు. అయితే హిమాచల్ ప్రదేశ్​కు చెందిన ఓ రైతు నెల రోజుల్లో విక్రయించిన టమాటాలతో ఏకంగా కోటీశ్వరుడయ్యాడట.

హిమాచల్​లో మండీ జిల్లా బాల్హ్‌ లోయకు చెందిన 67 ఏళ్ల జైరామ్‌ సైనీ సుమారు 37 ఎకరాల్లో సాగు చేసిన టమాటా పంట కాసుల వర్షం కురిపించింది. దాదాపు 8,300 బాక్సులు అమ్మడం ద్వారా రూ.1.10 కోట్లు తన ఖాతాలో వేసుకున్నారు. 50 ఏళ్లుగా టమాటా సాగు చేస్తున్నా.. ఈ ఏడాది మాత్రమే ఆయనకు అదృష్టం వరించింది. గతేడాది ఇదే సమయంలో 10 వేల టమాటా బాక్సులు విక్రయించగా రూ. 55 లక్షలు మాత్రమే వచ్చినట్లు సైనీ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news