హిందువులకు రాష్ట్రాలు మైనారిటీ హోదా ఇవ్వచ్చు…. సుప్రీంకు కేంద్రం సమాధానం

-

హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాల్లో వారికి మైనారిటీ హోదా ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్రం, సుప్రీం కోర్ట్ కు సమాధానం ఇచ్చింది. 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో హిందువులు మైనారిటీలుగా ఉన్నారని.. వారికి మైనారిటీ హోదా ఇవ్వకపోవడంతో కేంద్ర మైనారిటీ పథకాలకు దూరం అవుతున్నారని… వారిని మైనారిటీలుగా గుర్తించేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ… న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యా సుప్రీం కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై కేంద్రం సుప్రీం కోర్ట్కు సమాధానం ఇచ్చింది.

ప్రస్తుతం లడఖ్, మిజోరాం, లక్షద్వీప్, కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, పంజాబ్, మణిపూర్ హిందువులు మైనారిటీలుగా ఉన్నారు. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం యూదులకు మైనారిటీ హోదా ఇచ్చిన అంశాన్ని కర్ణాటక రాష్ట్రంలో ఉర్దూ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ, తుళు, లమాని, హిందీ, కొంకణి మరియు గుజరాతీ భాషలను మైనారిటీ భాషలుగా కర్ణాటక ప్రభుత్వం నోటిఫై చేసిన విషయాన్ని కేంద్రం ప్రస్తావించింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news