డబ్బులను బట్టి మనుషుల్ని చూస్తూ ఉంటారు. డబ్బున్న వాళ్ళని ఒక విధంగా.. డబ్బు లేని వాళ్ళని మరో విధంగా ట్రీట్ చేస్తూ ఉంటారు. చాలా మంది డబ్బులేని వాళ్ళు ఇలాంటి అవమానాలకు గురి అవుతూ వుంటారు. నిజానికి డబ్బులేదని హీనంగా చూస్తే గుండె తరుక్కుపోతుంది. అదే పరిస్థితి గోవింద్ జైసవాల్ కి కూడా ఎదురైంది.
చిన్నతనం నుండే ఎన్నో వినాల్సి వచ్చింది. దీనితో చాలా సార్లు బాధ పడ్డారు కూడా. తండ్రి రిక్షావాడు పైగా వీళ్ళు పేద వాళ్ళు కావడంతో చాలా హీనంగా చూసేవారు. తండ్రి రిక్షా నడిపేవాడు చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలను చూశారు పైగా ఎన్నో మాటల్ని భరించారు. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉండేవి.
స్నేహితులు తల్లిదండ్రులు కూడా ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి. నిజానికి ఇలాంటివి వింటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. అయితే ఆ కసే అతన్ని కలెక్టర్ ని చేసింది. అతని పేరు గోవిందు జైస్వాల్. గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేస్తుండే వాడు.
సంపాదన మొత్తం ఇంట్లో వారి గురించే ఖర్చు చేసేవాడు. అప్పటి వరకు అంతా బాగానే వుంది కానీ ఓ రోజు రేషన్ షాప్ అనుకోకుండా మూసివేశారు. దీంతో నారాయణ జైస్వాల్ ఉపాధి కోల్పోయాడు. అప్పుడు ఏం చెయ్యాలో తోచక అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. ఎవరైతే ఆ రిక్షాలను తీసుకుని అద్దె చెల్లిస్తారో వారికీ కిరాయికి ఇచ్చేవాడు. ఇలా డబ్బులను దాస్తూ కొంత భూమిని కొన్నాడు.
ఒకరోజు జైస్వాల్ తండ్రి ఆడపిల్ల కి పెళ్లి చేయాల్సి వచ్చి రిక్షాలను, దాచుకున్న భూమిని కూడా అమ్మేశారు. ఎలాగోలా ఆడపిల్లకి పెళ్లి చేశాడు కానీ తన కొడుకుని మాత్రం బాగా చదివించాలని అనుకున్నాడు. అందుకనే తానే రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు నారాయణ జైస్వాల్.
పై చదువులు అయిపోయిన తర్వాత కలెక్టర్ అవ్వాలని అనుకున్నాడు గోవింద్. తన తండ్రికి తన కోరికను కూడా చెప్పాడు. సంతోషంతో తండ్రి దాచిన 40 వేల రూపాయలను కోచింగ్ కోసం ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లిన గోవింద్ జైస్వాల్ కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఇలా ఎంతో కష్టపడి సివిల్స్ పరీక్షలు రాశాడు. 2006 లో ఫలితాలు అతని జీవితాన్ని మార్చేశాయి. మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 48వ ర్యాంకు వచ్చింది ప్రస్తుతం స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గోవాలో పనిచేస్తున్నారు.