భారత్ లో రోజుకు ఎన్ని లక్షల పి పి ఈ కిట్ల తయారీ అంటే…!

భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత పి పి ఈ ఇట్ల అవసరమనేది భారీగా పెరిగింది. అయితే మన దేశంలో తయారీ సరిగా లేకపోవడంతో చైనా సహా ఇతర దేశాల నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం కూడా ఎక్కువగానే పెరిగింది. ఈ తరుణంలోనే క్రమంగా భారత్ లో తయారీ అనేది మొదలుపెట్టారు. ఆత్మ నిర్భర భారత్ అనే కార్యక్రమం ద్వారా ఎక్కువగా మన దేశంలో పీపీ ఈ కిట్ల తయారీ అనేది జరుగుతుంది.

దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో ప్రతి రోజు 4.5 లక్షల కిట్స్ తయారవుతున్నాయని బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వచ్చిన కొత్తలో చైనా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకున్నారు.. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు.