విడాకులకు సిద్ధమైన ఐఏఎస్ టాపర్స్ జంట..!

వారిద్దరు ఐఏఎస్ లో టాపర్స్.. మీ అందిరికే తెలిసే ఉంటుంది. 2015లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫలితాల్లో టీనా మొదటి ర్యాంకు సాధించింది. అథరో రెండో ర్యాంకు సాధించాడు. ఈ జంట రాజస్థాన్ లోని జైపుర్ లోని ఫ్యామిలో కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వీరు నిజజీవితంలో ఫెయిల్ అయ్యారా.. అసలేం జరిగి ఉంటుంది. వీరు ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీలో శిక్షణ పొందారు. అక్కడే వీరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పెళ్లికి సిద్ధపడ్డారు. 2018లో వీరు వివాహం కూడా చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరైన ప్రేమ బంధంతో ఒక్కటైయ్యారు.

divorce
divorce

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచారని పలువురు అభినందించారు కూడా. అప్పట్లో రాహుల్ గాంధీ వీరి వివాహాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘‘మీ ప్రేమ మరింత బలపడాలని, మతాల విషయంలో విద్వేశపూరిత గొడవలు జరుగుతున్న ఈ తరుణంలో మీ పెళ్లి పలువురికి ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తున్నా.’’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. ఇంకా ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రవిశంకర్ ప్రసాద్, సుమిత్రా మహాజన్ వంటి ప్రముఖలు వీరి వేడుకకు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా అతిథుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

ఏమైందో ఏమో పెళ్లైన 3ఏళ్లకై విడాకులకు సిద్ధమయ్యారు. మూడేళ్ల ప్రేమ.. మరో ముడేళ్ల వివాహ బంధంతో విసిగిపోయారేమో.. ఒకరికొకరు విడిపోవడానికి అంగీకరించారు. ప్రస్తుతం టీనా, అధర్ రాజస్థాన్ క్యాడరర్ లోనే విధులు నిర్వహిస్తున్నారు. అధర్ సొంత రాష్ట్రం జుమ్మూకశ్మీర్ కాగా.. ఆయన ఐఐటీ విద్యార్థి. టీనా సొంత రాష్ట్రం మధ్య ప్రదేశ్ భూపాల్ . దళిత కుటుంబంలోని ఐఏఎస్ అయిన తొలి మహిళగా టీనా రికార్డు సృష్టించింది. వీరు విడిపోవడానికి కారణాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ వార్త విని చాల మంది షాక్ కు గురయ్యారు. కాగా త్వరలోనే వీరికి విడాకులు మంజూరుకానున్నాయి.