నిరుద్యోగలకు అలర్ట్.. ప్రభుత్వ బ్యాంకుల్లో 1402 పోస్టులు

-

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోని పలు విభాగాల్లో.. ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ బ్యాంకింగ్ పర్సనల్​ సెలక్షన్​ (ఐబీపీఎస్​) మొత్తం 1402 స్పెషల్​ ఆఫీసర్​ పోస్టుల నియామకాలను చేపట్టనున్నట్లు తెలిపింది. కేటగిరీల ఆధారంగా పోస్టులను కేటాయించిన ఈ భర్తీ ప్రక్రియకు సంబంధించి దరఖాస్తు​లను ఈనెల 1 నుంచి స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది.

పోస్టులు వారీగా ఖాళీలు..

  • ఐటీ ఆఫీసర్​- 120
  • అగ్రికల్చర్​ ఫీల్డ్ ఆఫీసర్​(ఏఎఫ్​ఓ)- 500
  • రాజ్​భాషా అధికారి- 41
  • లా ఆఫీసర్- 10
  • హెచ్​ఆర్​/పర్సనల్​ ఆఫీసర్- 31
  • మార్కెటింగ్​ ఆఫీసర్​(ఎంఓ)- 700

దరఖాస్తుకు ఈనెల 21న గడువు ముగియనుంది. ఐబీపీఎస్.. ప్రిలిమ్స్ డిసెంబర్​ 30,31వ తేదీల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జనవరి 28న జరగనుంది. ఈ పరీక్షకు దరఖాస్తు రుసుము.. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు- 850.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- 175/ ఉంది. అభ్యర్థుల వయసు 20-30 ఏళ్లలోపు ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news