విద్యార్థుల ఆందోళనలతో ఐఐఎం కోల్‌కతా క్యాంపస్ హోరెత్తింది. క్యాంపస్‌లోని మెస్‌లో ఆహారంలో నాణ్యత లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో ఉన్న నాలుగు క్యాంటీన్లలో ఒక క్యాంటీన్లో ఆహారం బాగోలేదని అన్నారు. ఆహారంలో పురుగులు, ఇనుప తీగలు వస్తున్నాయని ఆరోపించారు.
ఇలాంటి ఘటనలపై యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థులు వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక మెస్‌ను మూసేశారు సిబ్బంది. అలాగే విద్యార్థుల నిరసనలు నేపథ్యంలో మిగిలిన మూడు మెస్‌లను మంగళవారం మూసేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంటీన్ సిబ్బంది వారిని క్యాంపస్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు.
‘గత రెండు నెలలుగా క్యాంపస్‌లోని మెస్‌లోని ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది అనారోగ్యం పాలయ్యారు. ఇలా జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు క్యాంటీన్లో తినడం మానేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంపస్‌లోకి రానివ్వట్లేదు.’
-ఐఐఎం విద్యార్థి