చెన్నైలో వింత సంఘటన చోటు చేసుకుంది. ట్యూషన్ టీచర్‌తో ప్రేమలో పడ్డాడు ఓ మైనర్ బాలుడు.. తనను దూరం పెట్టిందని ఏం చేశాడో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నైలోని పెరియామెట్లో ఇరవై రెండేళ్ల ట్యూషన్ చెప్పే టీచర్‌తో ఓ మైనరు (17) ప్రేమలో పడ్డాడట. అయియే కొంత కలంగా ఆమె తనను దూరంగా పెట్టింది.
దీంతో ఆ యువతి పేరిట వాళ్ల ఇంటి చిరునామాకు వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆర్డర్లు, 77 సార్లు ఓలా, ఊబర్ రైడ్స్ బుక్ చేసి వేధించాడు. ఆ ఆర్డర్స్‌తో వచ్చేవారిక సమాధానం చెప్పలేక ఆమె కుటుంబం సతమతమైంది. చివరకు ఎవరో గుర్తుతెలియని ఫోన్ నంబరు నుంచి తమ కుమార్తెను వేధిస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి.. రెండు సెల్ ఫోన్లు, వైఫై రూటర్‌ను సీజ్ చేశారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.