ఇండియాను ప్రపంచం ఐసోలేషన్ చేస్తోందా అంటే అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు ఇండియా నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించాయి. తమ పౌరులైనా సరే రావొద్దంటే ఆదేశాలు జారీ చేశాయి. ఒకప్పుడు ఇటలీ, అమెరికా, లండన్ నుంచి వచ్చే వారిపై ఈ ఆంక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు ఇండియాపై ఈ ఆంక్షలను ప్రపంచం విధిస్తోంది.
ఆంక్షలు అంటే మామూలు ఆంక్షలు కాదండి.. చాలా కఠిన మైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇండియా అంటే చాలు.. వద్దంటూ ఆర్డర్ వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే వారిపై కఠిన శిక్ష విధించింది. ఇండియాలో ఎవరు తిరిగినా.. వారు తమ దేశంలో అడుగు పెట్టొద్దంటూ అల్టిమేటం జారీ చేసింది.
ఇండియాలో 14రోజులు పర్యటించి తమ దేశానికి వస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు 66వేల డాలర్లు(మన కరెన్సీలో 48లక్షలు) భారీ శిక్ష విధిస్తామని తెలిపింది. తమ పౌరులకు కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఇండియాలో 9వేల మంది ఆస్ట్రేలియన్లు ఉన్నట్టు సమాచారం. ఇందులో 600పైగా కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఆంక్షలు మే1నుంచే అమల్లోకి వచ్చాయి. కాగా ఇవి ఎప్పుడు ముగుస్తాయో ఆస్ట్రేలియా చెప్పలేదు.