108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహం ఆవిష్కరణ

-

మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్ లో ఏర్పాటు చేసిన 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్. ఈ విగ్రహానికి “స్టాచ్యూ ఆఫ్ వన్ నెస్” అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ విగ్రహ ప్రతిష్టాపనలో సుమారు 5000 మంది దర్శనీయులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న సాంప్రదాయ శైవ నృత్యకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆచార్య శంకర్ రచించిన రెండు పుస్తకాలను విడుదల చేశారు.

వాస్తవానికి ఈ విగ్రహావిష్కరణను ఈ నెల 18న నిర్వహించాల్సి ఉంది. అయితే జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ విగ్రహాన్ని గురువారం రోజు ఆవిష్కరించారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ విగ్రహ నిర్మాణం కోసం 2.141 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ను కేటాయించింది. అనేక లోహాలతో చేసిన ఈ విగ్రహాన్ని 12 ఏళ్ల బాలుడి రూపంలో ఉన్న ఆదిశంకరాచార్యులుగా ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ మ్యూజియాన్ని కూడా నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news