కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక కేంద్రం అయోధ్య రామ మందిరం. ఈ ఆలయం నిర్మాణ పనులు చకాచకా జరుగుతున్నాయి. ఇక యూపీలోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
వచ్చే ఎడాది జనవరి 21 నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు VHP కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికి పైగా మత ప్రముఖులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రారంభోత్సవానికి సన్నాహకంగా ఈ నెల 30 నుంచి అక్టోబర్ 15 వరకు గ్రామాల్లో శౌర్య యాత్రల నిర్వహణకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. 136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల మంది మతపెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించనున్నట్లు తెలిపింది. అంతే కాకుండా రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించనున్నట్లు పేర్కొంది. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రత్యేక వేడుక జరుగుతుందని చెప్పారు.