World Cup 2023 : భారత్, ఆస్ట్రేలియా ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరుగనున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించి ఆట సాధ్యం కాకపోతే రిజర్వ్ డే నవంబర్ 24 కొనసాగిస్తారు. ఆరోజు కూడా మ్యాచ్ సాధ్యం కాక రద్దయితే మాత్రం టోర్నీ నిబంధనాల ప్రకారం ఈరోజు అట్లను విజేతగా ప్రకటిస్తారు.
ఒకవేళ ఇరుజట్ల స్కోర్లు టై అయితే మాత్రం సూపర్ ఓవర్ ఆడిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే ఫలితం తేలేవరకు సూపర్ ఓవర్లు నిర్వహిస్తారు. గత ప్రపంచకప్ మాదిరి బౌండరీల కౌంట్ అనే అసంబదమైన నిబంధనను ఉపయోగించారు. ఈ రూల్ ను మెరీలీబోన్ క్రికెట్ క్లబ్ రద్దు చేసింది 2019 వన్డే ప్రపంచ ప్ ఫైనల్లో ఈ రూల్ ద్వారానే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఉత్కంఠ సాగిన ఆ ఫైనల్ పోరులో ఇరుజట్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్ నిర్వహించగా….మళ్లీ స్కోర్లు టై అయ్యాయి. దాంతో బౌండరీ కౌంట్ అని అసంబంధమైన నిబంధనతో ఇంగ్లాండ్ ను విజేతగా ప్రకటించారు.