భారత్ దూకుడు.. చైనా సరిహద్దుల్లో ట్యాంకర్లతో మోహరింపు..!

-

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో భద్రతను మరింత పెంచింది భారత్​. దౌలత్​ బేగ్ ఓల్దీ(డీబీఓ), దేప్​సంగ్​ మైదానాల్లో భారీగా బలగాలను మోహరించింది. హెవీ ట్యాంకర్లను తరలించింది. చైనా సైన్యం కవ్విస్తే దీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాంతాల్లో ఏప్రిల్​ – మే నుంచి 17 వేల బలగాలను చైనా మోహరించింది. అక్కడి నుంచి వెనక్కి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. పెట్రోలింగ్​ పాయింట్​ 10, 13 పాంతాల్లో భారత్ గస్తీ నిర్వహించడానికి వీల్లేకుండా అడ్డుకుంది.

army tankers
army tankers

ఇక ఈ నేపథ్యంలోనే చైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్​ కూడా 15 వేలకు పైగా బలగాలు, భారీ ఆయుధ వాహనాలు మోహరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒక వేళ చైనా తెగిస్తే భారత్ చేతిలో చావు దెబ్బ తప్పదని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నాయి. డీబీఓ సెక్టార్​కు ఎదురుగా ఉన్న టీబడ్ల్యూడీ బెటాలియన్ ప్రధాన కార్యాలయం నుంచి కారాకోరం పాస్ ఏరియా వరకు రోడ్డు నిర్మించాలని భావిస్తోంది ఛైనా. అందుకే అక్కడి నుంచి సైనికులను ఉపసంహరించుకోవడంలేదు.

Read more RELATED
Recommended to you

Latest news