అక్టోబరు 10లోగా దౌత్యసిబ్బందిని తగ్గించుకోండి.. ఉద్రిక్తతల వేళ కెనడాకు భారత్ అల్టిమేటం!

-

ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ హత్య కేసుతో భారత్‌, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్రిక్తతల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ టెన్షన్ కొనసాగుతున్న సమయంలో కెనడాకు భారత్​ ఓ అల్టిమేటం జారీ చేసింది. భారత్‌లో వారి దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని కెనడాకు న్యూదిల్లీ సూచించినట్లు తెలిసింది. అక్టోబరు 10లోగా దాదాపు 40 మంది దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకోవాలని డెడ్​లైన్ విధించినట్లు సమాచారం.

దౌత్యసిబ్బంది సంఖ్య విషయంలో సమానత్వం ఉండాల్సిన అవసరముందని భారత్‌ గతంలోనూ కెనడాకు సూచించింది. ఇటీవల నిజ్జర్‌ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్‌ దిల్లీలో కెనడా దౌత్యవేత్తల అంశాన్ని కూడా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఒట్టావాలోని భారత దౌత్యసిబ్బంది సంఖ్యతో పోలిస్తే దిల్లీలో కెనడా సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉందని.. అందువల్ల దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలంటూ కెనడాకు డెడ్‌లైన్‌ విధించినట్లు తెలుస్తోంది. ఆ తేదీ దాటిన తర్వాత కూడా అదనంగా ఉన్న సిబ్బందికి దౌత్యపరమైన రక్షణను తొలగిస్తామని భారత్‌ హెచ్చరించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news