అంతర్జాతీయ పరిణామాలకు ప్రభావితం కాకుండా ఉండాలంటే రాబోయే / ఐదేళ్లలో భారత్ ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ 90వ వార్షికోత్సవం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మోడీ.. జూన్ లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్కరికీ కావాల్సినంత స్వయంసమృద్ధి సామర్థ్యాన్ని పెంచాలి.
ఇప్పటికే భారత బ్యాంకింగ్ రంగం లాభదాయకంగా మారింది. గడిచిన పదేళ్ల కాలంలో ప్రభుత్వం, ఆర్బీఐ సంయుక్త చర్యలతో క్రెడిట్ వృద్ధి కొనసాగుతోంది. 2018లో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 11.25 శాతం నుంచి 2023, సెప్టెంబర్ నాటికి 3 శాతానికి తగ్గింది. ప్రస్తుతం బ్యాంకుల్లో, క్రెడిట్ వృద్ధి 15x శాతంగా ఉంది. ఈ విజయాలన్నింటిలో ఆర్బీఐ కీలక పాత్ర పోషించిందని మోడీ పేర్కొన్నారు.