దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. ఆ రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

-

రుతుపవనాల రాకతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని రాష్ట్రాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో అత్యంత భారీ వానలు పడే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వర్షాల వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా అప్రమత్తం అవ్వాలని హెచ్చరించింది. రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

జులై 5వ తేదీ వరకూ ఉత్తరాఖండ్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఆ రాష్ట్రంలో ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొన్ని రోజులపాటు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్​లోని పలు ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గోవా పనాజీ, మహారాష్ట్రకు కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news