ఆ వ్యాక్సిన్ ముందు భారతీయులకే…!

ఆస్ట్రాజెనెకా తయారు చేస్తున్న కోవిడ్ వ్యాక్సిన్ 90 శాతం వరకు ప్రభావవంతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆక్స్ఫర్డ్ ప్రకటన చేసింది. ఇక ఇప్పుడు ఇప్పుడు దాని భారతీయ భాగస్వామి సీరం ఇన్స్టిట్యూట్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇతర దేశాలకు పంపిణీ చేయడానికి ముందు ఈ టీకాను భారతీయులకు సరఫరా చేయడంపై దృష్టి పెడతామని ప్రకటించింది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదార్ పూనవల్లా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.

తమకు ముందు మొదట మన దేశాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఇతర దేశాల గురించి ఆలోచన చేద్దాం అని చెప్పారు. కోవాక్స్ అనేది పేద దేశాలకు కూడా అందుతుంది అని చెప్పారు. కొనుగోలు ఒప్పందానికి ముద్ర వేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని, 2021 ఏప్రిల్ నాటికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ భారత మార్కెట్లలోకి వస్తుందని ఆశిస్తున్నామని అదర్ పూనవల్లా చెప్పారు.