కెనడాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

-

ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్న యువతపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. ముఖ్యంగా అమెరికా, కెనడాలో భారతీయ విద్యార్థులపై ఇలాంటి ఘటనలు ఎక్కువవుతున్నాయి. తమ పిల్లలు ప్రయోజకులు అవుతారని ఆశతో విదేశాలకు పంపిస్తే చివరకు విగత జీవులుగా తిరిగి వస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. తాజాగా కెనడాలో ఓ భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. ఏం జరిగిందంటే?

కెనడాలోని వాంకోవర్‌లో చిరాగ్‌ అంటిల్‌ (24) అనే భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యాడు. అతడు కారులో ఉండగా దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతి విషయాన్ని సౌత్‌ వాంకోవర్‌ పోలీసులు తెలిపారు. కాల్పుల శబ్దం వినిపించినట్లు ఈ నెల 12వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులకు సమాచారం రాగానే వారు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. అప్పటికే కారులో చిరాగ్‌ విగత జీవిగా పడి ఉండటం కనిపించింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని వాంకోవర్‌ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎవర్నీ అరెస్టు చేయలేదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version