కోవిడ్ ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ భారతీయులు ఈ దేశాల‌కు మాత్రం వెళ్ల‌వ‌చ్చు..!

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌పై కేంద్రం ఎప్ప‌టిక‌ప్పుడు నిషేధం విధిస్తున్న సంగ‌తి తెలిసిందే. అన్‌లాక్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్పటికీ, దేశంలో అనేక ఆంక్ష‌ల‌ను ఇప్ప‌టికే స‌డ‌లించినా.. అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను మాత్రం పూర్తి స్థాయిలో న‌డ‌ప‌డం లేదు. అయిన‌ప్ప‌టికీ భార‌తీయులు ప‌లు దేశాల‌కు వెళ్ల‌వ‌చ్చు. భార‌త్ మొత్తం 21 దేశాల‌తో ఎయిర్ బ‌బుబ్ అరేంజ్‌మెంట్ ఒప్పందం చేసుకుంది. ఈ కార‌ణంగా ఆ 21 దేశాల‌కు భార‌తీయులు విమానాల్లో వెళ్ల‌వచ్చు.

indians can travel to these counties amid covid rules

ఆఫ్గ‌నిస్థాన్‌, భూటాన్‌, అమెరికా, యూకే, జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్‌, జ‌పాన్‌, ఖ‌తార్, బహ్రెయిన్‌, యూఏఈ, మాల్దీవ్స్‌, బంగ్లాదేశ్‌, నైజీరియా, ర్వాండా, టాంజానియా, నెద‌ర్లాండ్స్‌, కెన‌డా, ఇరాక్‌, కెన్యా, ఓమ‌న్‌, ఉక్రెయిన్ దేశాల‌కు భార‌తీయులు వెళ్ల‌వ‌చ్చు. క‌ఠిన‌మైన కోవిడ్ నిబంధ‌న‌ల‌ను ప్ర‌యాణికులు పాటించాల్సి ఉంటుంది. ఇక విదేశాల‌కు వెళ్లాక అక్క‌డ వారు అమ‌లు చేస్తున్న నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్ణీత రోజుల‌పాటు క్వారంటైన్‌లో ఉండాలి. ఈ క్ర‌మంలో భార‌తీయులు అన్ని జాగ్ర‌త్త‌లు, రూల్స్ ను పాటిస్తూ విదేశాల‌కు సేఫ్‌గా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు.

అయితే ప్ర‌స్తుతానికి భార‌తీయులు ఆయా దేశాల‌కు మాత్ర‌మే వెళ్లేందుకు అనుమ‌తులు ఉన్నా.. న‌వంబ‌ర్ 30 త‌రువాత మ‌రిన్ని దేశాల‌ను ఆ జాబితాలో చేర్చ‌నున్నారు. దీంతో మ‌రిన్ని దేశాల‌కు భార‌తీయులు వెళ్లేందుకు వీలు క‌లుగుతుంది. కేవ‌లం వందే భార‌త్ కింద మాత్ర‌మే విమాన స‌ర్వీసుల‌ను న‌డిపిస్తున్నారు.