ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సంచలనం అయ్యాయి ఏపీ ప్రభుత్వం వద్దని చెప్పినా సరే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగం ప్రకారం వెళ్తుంది అని స్పష్టం చేసి ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఉంటుంది అని స్పష్టం చేసారు. ఇక తాజాగా ప్రభుత్వం వద్దని చెప్పడంతో ఆయన గవర్నర్ ని కలిసారు. గవర్నర్ తో నిమ్మగడ్డ రమేష్ భేటీ అయ్యారు. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ కి ఆయన ఫిర్యాదు చేసారు.
ఎన్నికల నిర్వహణపై వివిధ పార్టీలు వెల్లడించిన అభిప్రాయాలను ఆయన గవర్నర్ కి వివరించారు. పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా సరే కరోనా పేరుతో అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ భేటీ జరిగింది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘంను చిన్న బుచ్చె విధంగా ప్రభుత్వం అధికారులను ప్రోత్సహిస్తుంది అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి సహకారం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు