సైనికా వందనం…. గడ్డకట్టే చలిలో హిమాలయాల్లో కాపుకాస్తున్న ఐటీబీపీ దళాలు

అలసే శీతాకాలం సాధారణ మైదాన ప్రాంతాల్లోనే జనాలు రాత్రిళ్లు చలికి భయపడి బయటకు రావడానికి జంకుతుంటారు. అలాంటిది హిమాలయాల్లో వేల అడుగున ఎత్తులో సరిహద్దులను రక్షిస్తూ.. దేశ సార్వభౌమాధికారాన్ని నిలబెడుతున్న సైనికులకు వందనం తెలపాల్సిందే. అంతటి ప్రతికూల వాతావరణంలో కూడా శత్రు దేశాల నుంచి మనదేశాన్ని కాపాడుతున్నారు. 

తాజాగా ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్( ఐటీబీపీ) దళాలు అత్యంత ఎత్తులో పహారా కాస్తున్న వీడియోను విడుదల చేసింది ఆర్మీ. హిమాచల్ ప్రదేశ్ లో 14000 అడుగుల ఎత్తులో మైనస్ 20 డిగ్రీల గడ్డకట్టించే చలిలో కాపు కాస్తున్నారు ఐటీబీపీ దళాలు. ఇది వరకు కూడా అత్యంత ఎత్తులో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో ఐటీబీపీ దళాలు పహారా కాస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ఇటీవల అత్యంత ఎత్తు ఉండే..పర్వతాన్ని కూడా అధిరోహించారు. హిమాలయాల్లో సమర్థవంతంగా పనిచేసే దళాల్లో ఐటీబీపీ బలగాలు ముందు వరసలో ఉంటాయి. కఠినమైన ట్రైనింగ్, ఎంతో మానసిక స్థైర్యం కలిగిన ఈ దళాలు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తుంటారు.