మణిపుర్‌లో మరో ఐదు రోజులు ఇంటర్నెట్ బంద్‌

-

మణిపుర్‌లో ఇంకా హింస చెలరేగుతూనే ఉంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించినా అక్కడి పరిస్థితులు చక్కదిద్దుకోలేదు. అయితే ఈ అల్లర్లను అరికట్టే చర్యల్లో భాగంగా ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్‌ సేవలను మరో ఐదురోజుల పాటు నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్‌ 15 వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపింది.

‘ఇంటర్నెట్‌పై నిషేధాన్ని మరో ఐదు రోజులు కొనసాగిస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచార వ్యాప్తి, వదంతులను ప్రచారం చేయకుండా ఈ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు’ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

జూన్‌ 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు మణిపుర్‌లో ఇంటర్నెట్‌ పని చేయదని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాంతి, సామరస్యాన్ని స్థాపించడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర సమాచార ప్రసార శాఖ మంత్రి సపమ్‌ రంజన్‌ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news