మొదటిసారి అతడి గురించి ఓపెన్ అయిన ఇలియానా..!!

-

ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి చేసుకోకుండానే తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయం ఆమె స్వయంగా చెప్పడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇకపోతే గతంలో ఒక వ్యక్తితో ప్రేమలో పడడం బ్రేకప్ చెప్పుకోవడం అన్ని జరిగిపోయాయి.. ఇక మళ్లీ ఆమె ప్రముఖ నటి కత్రినా కైఫ్ సోదరుడు తో కూడా ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపించాయి. అయితే ఈ ప్రేమ గురించి ఆమె ఎప్పుడూ అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే ఈ ప్రేమ గురించి సరైన అధికారిక ప్రకటన చేయలేదు కానీ వెంటనే తాను పెళ్లి కాకుండా తల్లి కాబోతున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాక్ ఇచ్చింది.. పెళ్లి కాకుండానే తల్లి కావడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు ఇలియానా నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మాత్రం ఆమె చాలా గోప్యంగా ఉంచింది. కానీ రెండు రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తన చేతితో పాటు మరో వ్యక్తి చెయ్యి కూడా ఉన్న ఫోటోలను షేర్ చేయగా ఈ ఫోటోలు వైరల్ కావడంతో బహుశా ఈమెను అతనే పెళ్లి చేసుకుంటున్నారేమో అంటూ కూడా కామెంట్లు వ్యక్తం అయ్యాయి.

అయితే ఇప్పుడు మరొకసారి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణమైన వ్యక్తి గురించి ఆమె చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఇలియానా స్పందిస్తూ పెళ్లి కావడం అనేది ఒక గొప్ప అనుభూతి..మన శరీరంలో ఇంకో బిడ్డకు ప్రాణం పోయడం అనేది చాలా గొప్ప ఆనందాన్ని పంచింది. నా కష్టాలలో ఒక వ్యక్తి ఎప్పుడూ తోడుగా నిలిచి.. ఆ వేదన నుంచి నన్ను బయట పడేశారు. నా జీవితంలో నవ్వులు పూయించి నా జీవితాన్ని మరింత అందంగా మార్చాడు అంటూ ఆ వ్యక్తి గురించి ఆమె కామెంట్లు చేసింది. కానీ ఆ వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మాత్రం సస్పెన్స్ గానే పెట్టిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news