రవ్వ కి పురుగులు, చీమలు పట్టేస్తున్నాయి..? ఇలా చేస్తే ఆ బాధే ఉండదు.. ఎప్పుడు ఫ్రెష్ గానే..!

-

మనం కిరణ సామాన్లు ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్కసారి కొన్ని ఆహార పదార్థాలు పాడైపోతూ ఉంటాయి. చాలామంది ఇళ్లల్లో ఇలానే డబ్బులు వృధా అవుతూ ఉంటాయి. ఎక్కువ మంది రవ్వని తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు అయితే రవ్వకి చీమలు పట్టడం పురుగులు పట్టడం వంటివి కలుగుతూ ఉంటాయి. సాధారణంగా ఏదైనా ఆహార పదార్థాలను ఎక్కువ క్వాంటిటీతో మనం తెచ్చుకున్నట్లైతే వాటిని మనం నెలలు తరబడి నిల్వ చేస్తూ ఉంటాము.

నెల అంతా కూడా వాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఎక్కువ మోతాదులో సామాన్లు తెచ్చుకుంటాము. కానీ ఒక్కొక్కసారి చీమలు పురుగులు వంటి వాటి వల్ల త్వరగా అవి పాడైపోతూ ఉంటాయి. వంట చేసుకోవడానికి పనికిరావు చాలామంది ఇళ్లల్లో ఎక్కువగా బొద్దింకలు కూడా తిరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి బాధలు ఏమీ లేకుండా ఉండాలంటే ఈ చిట్కాలని పాటించండి.

ఈ ఇంటి చిట్కాలతో రవ్వ ఎప్పటికీ ఫ్రెష్ గానే ఉంటుంది పురుగులు చీమలు వంటివి పట్టవు. చీమలు లేదా పురుగులు పట్టకుండా ఉండాలంటే వేడి ఎండలో ఒక్కొక్క సారి పెడుతూ ఉండండి కీటకాలు పురుగులు వంటివి పట్టవు. ఎండలో పెట్టడం వలన తెగుళ్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేప వలన ఎన్నో ఔషధ గుణాలను మనం పొందొచ్చు అయితే వేప ఘాటు కి పురుగులు చీమలు వంటివి పట్టవు. మీరు డబ్బాలో రవ్వని వేసేసి కొన్ని వేపాకులను కూడా వేయండి అప్పుడు పురుగులు చేరకుండా ఉంటాయి.

కర్పూరంతో కూడా పురుగులు రావు అల్మారా లో కర్పూరాన్ని పెట్టండి అప్పుడు పురుగులు పట్టవు అదే మీరు డబ్బా లో వేస్తే ఆ వాసన రవ్వకి పట్టేస్తుంది దాంతో రవ్వ అంతా కూడా కర్పూరం వాసన వస్తుంది కనుక మీరు అల్మారా లో పెడితే సరిపోతుంది. చీమలు వంటివి పట్టకుండా ఉండాలంటే అల్మారా లో న్యూస్ పేపర్ వేసి న్యూస్ పేపర్ మీద డబ్బా పెట్టి న్యూస్ పేపర్ కింద మీరు కొంచెం చీమల మందు వేయండి ఇలా ఈ చిన్న చిన్న ఇంటి చిట్కాలతో రవ్వని నిల్వ ఉంచుకోవచ్చు. పురుగులు చీమలు వంటివి పట్టకుండా ఫ్రెష్ గా రవ్వ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news