ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్.. రూ.4 వేలకే షిర్డీ ట్రిప్

-

ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వేసవిలో అధ్యాత్మిక పర్యటనకు వెళ్లే వారి కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ముఖ్యంగా నాసిక్ త్రయంబకేశ్వర్, షిర్డీ వెళ్లే పర్యాటకుల కోసం సరికొత్త ప్యాకేజీ అందుబాటులోకి తీసుకువచ్చింది.  ‘సాయి శివం’ పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోండ‌గా.. రైలు మార్గంలో ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.

ఈ టూర్ ప్యాకేజీలో నాసిక్ త్రయంబకేశ్వర్, షిరిడీ ఆలయం, పంచవటి లాంటి అధ్యాత్మిక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండ‌గా.. ఇది 3 రాత్రులు, 4 రోజులు కొనసాగుతుంది. ఇక చార్జీల విషయానికి వస్తే.. కంఫర్ట్ ప్యాకేజీ ధరలో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.5890 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్‌లో డబుల్ ఆక్యుపెన్సీకి రూ.4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది.

ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.4910గా ధర నిర్ణయించారు. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. మే నుంచి జూన్ నెల వరకు ఈ ధరలే అందుబాటులో ఉంటాయి. ఈ ప్యాకేజీలో షిరిడీ దర్శనం. రైలు టికెట్లు, హోటల్‌లో వసతి, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news