ఇండియా కరోనా వ్యాక్సిన్ సేఫ్…?

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అంటూ దాదాపు అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. మన దేశంలో భారత బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ని తయారు చేస్తుంది. ఈ కరోనా వ్యాక్సిన్ పై మన దేశం చాలా ఆశలు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో భారత బయోటెక్ గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పాయి కేంద్ర వైద్య శాఖ వర్గాలు. భారత బయోటెక్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ వాడటం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని వెల్లడించారు.

వాక్సిన్ ట్రయల్స్ కోసం ఎంచుకున్న చాలా కేంద్రాలలో మానవ పరీక్షల దశ ఫేజ్ 1 ముగిసింది. ఆ తర్వాత ఫలితాలు బాగున్నాయి అని, వాలంటీర్ లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదు అని అధికారులు పేర్కొన్నారు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ఫేజ్ 2 హ్యూమన్ ట్రయల్స్ సెప్టెంబర్ లో మొదలవుతాయి. కరోనా వ్యాక్సిన్ ని ఇప్పటికే రష్యా నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news