విదేశీ చిన్నారులకు సోను సూద్‌ సాయం..!

-

వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూ సూద్ తన సొంత ఖర్చులతో పంపించిన విషయం తెలిసిందే. అలాగే ఉపాధి కోల్పోయిన కార్మికులకు కూడా తానే ఉపాధి కలిపిస్తున్నాడు. అదేవిధంగా కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురికి కూడా సోనూ సూద్ తన ఆపన్న హస్తాన్ని అందించారు. తాజాగా.. ఇప్పుడు విదేశీయులకు అండగా నిలిచారు సోనూ సూద్. ఫిలిప్పీన్స్‌ నుంచి 39 మంది చిన్నారులు న్యూఢిల్లీకి వచ్చి వైద్యం చేయించుకోవడం కోసం వారి విమాన ప్రయాణానికి సినీనటుడు సోను సూద్‌ సాయం ప్రకటించారు.

ఆ చిన్నారులకు న్యూఢిల్లీలో కాలేయ మార్పిడి చికిత్స చేయించడానికి ఇంతకు ముందు ఓ సంస్థ ముందుకు వచ్చింది. అయితే కరోనాతో ఇబ్బంది తలెత్తడంతో ఆ చిన్నారుల ప్రయాణం ఆగిపోయింది. విషయం తెలుసుకున్న సోను‌ వారిని రెండు రోజుల్లో భారత్‌కు వచ్చేలా సాయం చేస్తానని ట్వీట్ చేసారు. ఇక సోను సూద్ చేస్తున్న సహాయసహకారాలకు దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news