కోలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం

-

తమిళ సినిమా పరిశ్రమలో మంగళవారం ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పన్నుఎగవేతలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు చేపట్టింది. చెన్నై, మధురైలోని 40కి పైగా ప్రదేశాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభమయ్యాయి. కలైపులి థాను, ఎస్‌ఆర్ ప్రభు, అన్బు చెగియాన్, జ్ఞాన్‌వేల్ రాజా సహా పది మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ఆస్తులపై దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చెగియాన్ నివాసం, ఆయనకు చెందిన గోపురం సినిమా కార్యాలయంపై కూడా దాడులు సాగుతున్నాయి. ఆయనపై ఈ దాడులు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

ఇదివరకు 2020 ఫిబ్రవరిలో చెన్నైలోని అన్బు చెగియాన్‌కు చెందిన నివాసంలో ఐటీ దాడులు జరిగాయి. తమిళ స్టార్ విజయ్‌ నటించిన బిగిల్‌ సినిమా విడుదలైన తర్వాత ఆ తనిఖీలు జరిగాయి. అలాగే అప్పుడు విజయ్‌, మరికొందరు నిర్మాతల ఆర్థిక కార్యకలాపాలపై ఐటీ దృష్టి పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news