Jammu Kashmir: బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదిని లేపేసిన భద్రతా బలగాలు

జమ్మూ కాశ్మీర్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బ్యాంక్ మేనేజర్ ను చంపిన ఉగ్రవాదులను లేపేశాయి భద్రతా బలగాలు. షోపియాన్ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. షోపియాన్ లోని కంజియులర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంలో పోలీసులు, భద్రతాబలగాాలు గాలింపు చర్యలు చేపట్టగా.. ఇరు వర్గాల మధ్య ఎన్ కౌంటర్ ప్రారంభం అయింది. హతమైన ఉగ్రవారిని షోపియాన్ కు చెందిన జన్ మహ్మద్ లోన్ గా గుర్తించారు. 

హతమైన ఉగ్రవాది జూన్ 2న కుల్గామ్ జిల్లాలో బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్ హత్యకు పాల్పడ్డాడు. బ్యాంకులో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు అతిసమీపం నుంచి విజయ్ కుమార్ పై కాల్పులు జరిపారు. విజయ్ కుమార్ రాజస్తాన్ కు చెందిన వాసి. తాజాగా ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఏకే 47 రైఫిల్, పిస్టర్, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయని కాశ్మీర్ జోన్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.