జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయింది. రాంబన్ లోని మేకర్ కోట్ ప్రాంతంలోని ఖూని నాలాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో 10 మంది వరకు కూలిలు అందులో చిక్కుకుపోయారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సమచారం అందుకున్న అధికారులు రెస్క్యూ సేవలను ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ జేసీబీలతో రెస్క్యూ ఆపరేషన్ ను ప్రారంభించింది. ఇప్పటి వరకు శిథిలాల కింద చిక్కుకున్న ఇద్దరిని రక్షించారు. దాదాపు 37 మీటర్ల సొరంగం కూలిపోయింది. గాయపడినిన ఇద్దరిని సమీపంలో ఆస్పత్రికి తరలించారు. జమ్మూ, శ్రీనగర్ ప్రధాన జాతీయ రహదారిపై ఉన్న ఈ సొరంగం నిర్మాణ పనులు కొత్తగా ప్రారంభం అయ్యాయి. పరిస్థితిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉన్నట్లు కేంద్ర మంత్రి ట్విట్టర్ లో వెల్లడించారు.