బిహార్‌కు ప్రత్యేకహోదా!.. జేడీయూ కీలక డిమాండ్

-

ఎన్డీయేలో టీడీపీతో జేడీయూ కూడా కీలక భాగస్వామ్య పక్షమే. ఈ నేపథ్యంలో జేడీయూ బీజేపీ ముందు కీలక డిమాండ్లు ఉంచుతోంది. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ మళ్లీ తెరమీదకు తెస్తోంది. త్రివిధ దళాల్లో నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సమీక్షించాలని, దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కోరుతోంది.

బిహార్‌ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ సీనియర్‌ నేత, బిహార్‌ మంత్రి విజయ్‌కుమార్‌ చౌధరీ అన్నారు. విభజన తర్వాత తమ రాష్ట్రానికి ఎదురైన సమస్యల నుంచి గట్టెక్కడం ప్రత్యేక హోదా లేకుండా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో తమ పార్టీ బీజేపీకి బేషరతుగా మద్దతిస్తోందని జేడీయూ సీనియర్‌ నేత కె.సి.త్యాగి స్పష్టం చేశారు. అయితే అగ్నిపథ్‌పై ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారని .. ఆ పథకంలోని లోపాలు తొలగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం అగ్నిపథ్‌ను సమీక్షించాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news