జేఈఈ మెయిన్ 2024 (సెషన్-2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మంది 100 పర్సంటైల్ స్కోరు సాధించగా.. వీరిలో 22 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు. తెలంగాణ నుంచి 15 మంది, ఏపీ నుంచి ఏడుగురు విద్యార్థులు ఉన్నారు. ఏప్రిల్ 22న జేఈఈ మెయిన్ తుది కీ విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ కన్నా ఒకరోజు ముందే రిజల్ట్స్‌ను వెబ్ సైటులో అందుబాటులో ఉంచింది.
100 పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థులు..
1. హందేకర్ విదిత్
2. ముత్తవరపు అనూప్
3. వెంకట సాయి తేజ మదినేని
4. రెడ్డి అనిల్
5. రోహన్ సాయి బాబా
6. శ్రీయాశస్ మోహన్ కల్లూరి
7. కేసం చన్న బసవ రెడ్డి
8. మురికినాటి సాయి దివ్య తేజ రెడ్డి
9. రిషి శేఖర్ శుక్లా
10. తవ్వ దినేశ్ రెడ్డి
11. గంగ శ్రేయాస్
12. పొలిశెట్టి రితిష్ బాలాజీ
13. తమటం జయదేవ్ రెడ్డి
14. మావూరు జస్విత్
15. దొరిసాల శ్రీనివాస రెడ్డి
100 పర్సంటైల్ సాధించిన ఏపీ విద్యార్థులు..
1. చింటు సతీష్ కుమార్
2. షేక్ సురజ్
3. మకినేని జిష్ణు సాయి
4. తోటంశెట్టి నిఖిలేష్
5. అన్నరెడ్డి వెంకట తనిష్ రెడ్డి
6. తోట సాయి కార్తీక్
7. మురసాని సాయి యశ్వంత్ రెడ్డి