భారత్ రహస్యాలను చైనాకి చేరవేసిన జర్నలిస్ట్ అరెస్ట్..

గత కొన్ని రోజులుగా ఇండియా చైనా ల మధ్య ఘర్షణ జరుగుతున్న సంగతి తెలిసిందే. బోర్డర్ ఇష్యూపై చైనాకి ధీటుగా భారత్ సమాధానం ఇస్తూ వస్తుంది. ఐతే ఇండియా రహస్యాలని చైనాకి చేరవేస్తున్న ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్, రాజేష్ శర్మని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసారు. రాజేష్ శర్మతో పాటు కింగ్ షి అనే చైనా మహిళ, నేపాలీ అయిన షేర్ సింగ్ కూడా ఉన్నారు. 2016 నుండి 2018 వరకు ఇండియా సమాచారాని చైనాకి చేరవేసాడు.

ఢిల్లీపోలీసుల చెప్పిన దాని ప్రకారం, చైనాకి రహస్యాలు చేరవేస్తున్నానంటూ రాజేష్ శర్మ ఒప్పుకున్నాడట. చైనాలో మైకేల్ జార్జ్ అనే వ్యక్తికి డిజిటల్ ఛానెల్స్ ద్వారా సమాచారం అందించేవాడట. భారత దేశం- చైనా సరిహద్దు, మయన్మార్ కి సైనిక సహకారం మొదలగు అంశాలపై రహస్యాలు అందజేసాడట.