Karnataka elections: కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని పీపుల్స్ పల్స్ ఫీల్డ్ సర్వే తేల్చి చెప్పింది. మే 10వ తేదీన కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ రాజకీయపార్టీకి సంపూర్ణ మెజార్టీరాదని పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడించింది. కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉటుందని.. కాంగ్రెస్‌పార్టీకి 98, బిజెపికి 92, జెడిఎస్‌కు 27 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పీపుల్స్‌పల్స్ ప్రీపోల్ సర్వేలో తెలిపింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 95 – 105, బిజెపికి 90`100, జెడిఎస్‌క 25-30, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశం ఉన్నట్లు పీపుల్స్ ప్రీపోల్‌సర్వేలో వెల్లడించింది. కర్ణాటకలో ప్రీపోల్ సర్వేను పీపుల్స్‌పల్స్ సంస్థ – సౌత్‌ఫస్ట్ అనే ఇంగ్లీష్ వెబ్సైట్ కోసం నిర్వహించింది. 25 మార్చ్ నుండి 10 ఏప్రిల్ 2023 వరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5600 శాంపిల్స్‌తో పీపుల్స్‌పల్స్ సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది.
కాంగ్రెస్‌పార్టీకి 41 శాతం, బిజెపికి 36 శాతం, జెడిఎస్‌కు 16 శాతం, ఇతరులకు 7 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. 2018 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్‌పార్టీ అధికంగా 18 సీట్లు వచ్చే అవకాశం తెలిపింది పీపుల్స్‌పల్స్. కర్ణాటక రాష్ట్రానికి సిద్ధిరామయ్య ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని 32 శాతం, 25 శాతం యడ్డ్యూరప్ప, 20 శాతం బసవరాజ బొమ్మై , 18 శాతం కుమారస్వామి, 5 శాతం డి.కె.శివకుమార్‌ను కోరుకుంటున్నారని వెల్లడించింది పీపుల్స్‌పల్స్.