Karnataka : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

-

మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో బీజేపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర కేబినెట్‌ ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా తాజాగా ఆ రాష్ట్ర గవర్నర్‌ థావార్‌చంద్‌ గహ్లోత్‌ ఆమోద ముద్ర వేశారు. కర్ణాటకలో ఎస్సీలకు రిజర్వేషన్లు 17 శాతానికి, ఎస్టీలకు 7 శాతానికి పెరగనున్నాయి.

జస్టిస్‌ నాగమోహన్‌ దాస్‌ కమిటీ నివేదిక ఆధారంగా విద్య, ఉపాధి కల్పనల్లో రిజర్వేషన్‌ల శాతాన్ని ఎస్సీలకు 15 నుంచి 17శాతానికి, ఎస్టీలకు 3 నుంచి 7 శాతానికి పెంచాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని తీర్మానించింది. న్యాయపరమైన అడ్డంకుల కారణంగానే ఆర్డినెన్స్‌ ద్వారా ఈ రిజర్వేషన్‌ పెంపును అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. ఈ బిల్లును గవర్నర్‌ ఆమోదం కోసం పంపగా ఇవాళ ఆయన ఆమోదం తెలిపి ఎస్సీ, ఎస్టీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news