ఈరోజుల్లో చాలామంది డయాబెటిస్ తో బాధపడుతున్నారు డయాబెటిస్ ఉన్నవాళ్లు కచ్చితంగా జాగ్రత్త వహించాలి. లేకపోతే ప్రమాదం లో పడచ్చు. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి దీనికి శాశ్వతం నివారణ అంటూ ఏమీ లేదు డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకుంటే నార్మల్ లైఫ్ ని గడపలేరు. కనుక ఆరోగ్యం విషయంలో శ్రద్ద తీసుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలని అదుపులో ఉంచుకోవడానికి చూసుకోవాలి అయితే అది ఆహారంతో సాధ్యం. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిది అనేది తెలుసుకుందాం…
చిలకడదుంపలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది డయాబెటిస్ ఉన్నవాళ్లు చిలకడ దుంపలు తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది క్రోమియం ఇన్సులిన్ చర్యను నియంత్రిస్తుంది ఇన్సులిన్ చర్యలను మెరుగు పరుస్తుంది. డయాబెటిస్ తో పాటుగా గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది అయితే క్రోమియం ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది మరి ఎటువంటి ఆహార పదార్థాలలో క్రోమియం ఎక్కువ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుపచ్చ బీన్స్, బంగాళదుంప, గుడ్లు, చేప, కాఫీ, మొక్కజొన్న, బఠానీ, చిలగడదుంప, వెల్లుల్లి, యాపిల్స్, అరటిపండ్లు, ద్రాక్ష మొదలైన వాటిలో ఇది ఎక్కువగా ఉంటుంది. సో వీటిని తీసుకుంటూ వుండండి. అలానే ఫైబర్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. కాయకూరలు తినాలి. అలానే వ్యాయామం చేయాలి. ఆల్కహాల్, పొగాకుకు దూరంగా ఉండాలి. ఒత్తిడి లేకుండా చూసుకోండి.