WCలో భాగంగా హైదరాబాదులో జరిగిన వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. తోలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 345/5 రన్స్ చేసింది. రిజ్వాన్ 103, బాబర్ 80, షకీల్ 75 రన్స్ తో రాణించారు.
346 టార్గెట్ ను కివిస్ 43.3 ఓవర్లలో ఛేదించింది. రచిన్ రవీంద్ర 97, చాప్ మన్ 65, మిచెల్ 59, విలియంసన్ 54 రన్స్ చేశారు. మరో మ్యాచ్ లో శ్రీలంకపై బంగ్లాదేశ్ 7 వికెట్లతో విజయం సాధించింది.
కాగా, వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాక్ ప్లేయర్ల కోసం ప్రత్యేక మెనూ ఏర్పాటు చేశారు. హైదరాబాది బిర్యానితో పాటు చికెన్, మటన్, ఫిష్, గ్రిల్ ల్యాంబ్ షాప్స్, మటన్ కర్రీ, బటర్ చికెన్, గ్రిల్డ్ ఫిష్ వంటివి మెనూలో చేర్చారు. అలాగే స్టీమ్ బాస్మతి రైస్, బోలోగ్నీస్ సాసు తో కూడిన స్పాగెట్టి, వెజ్ పులావ్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఏడేళ్ల తర్వాత భారత్ కు వచ్చిన పాకె జట్టు రెండు వారాలపాటు హైదరాబాద్ లోనే ఉండనుంది.