వేసవి వచ్చిందంటే చాలు ప్రజలకు గుర్తుకు వచ్చే పానీయం నిమ్మరసం. ప్రజలు వేసవి తాపం నుంచి తప్పంచుకునేందుకు నిమ్మకాయ షర్భత్ ను ఇష్టపడుతుంటారు. ప్రతీ ఇంట్లో కూడా నిమ్మకాయలు ఉండవంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లలో నిమ్మకాయలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. అయితే అలాంటి నిమ్మకాయలు సామాన్యుడికి అందనంటున్నాయి. నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలు పెరిగిన నిమ్మకాయ రేట్లతో ఇబ్బందులు పడుతున్నారు.
గతంలో కేజీ నిమ్మకాయల ధర రూ. 50-60 ఉంటే ప్రస్తుతం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. కేజీ నిమ్మకాయ ధర రూ. 200 పైగానే ఉంది. కొన్ని చోట్ల హోల్ సేల్ ధర 100 నిమ్మకాయలకు రూ. 500 పలుకుతోంది. గుజరాత్ లో కేజీ నిమ్మ ధర రూ. 240 పలుకుతుంటే, కర్ణాటకలో రూ.160గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒక్కో నిమ్మకాయ ధర రూ. 15 పలుకుతుందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో నిమ్మ ధరలు అమాంతంగా పెరిగాయి.